ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొతేరాకు మోదీ పేరు పెట్టడంపై సీఎం సెటైర్లు

ABN, First Publish Date - 2021-02-25T02:44:27+05:30

ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని మొతెరా క్రికెట్ స్టేడియం పేరు మారిపోయింది. పునర్నిర్మాణానికి ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అని ఉన్న ఈ పేరును తాజాగా నరేంద్రమోదీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్‌పూర్: గుజరాత్‌లోని మొతేరా క్రికెట్ స్టేడియంకు నరేంద్రమోదీ పేరు పెట్టడంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ సెటైర్లు వేశారు. మోదీకి రిటైర్ కావాల్సిన సమయం దగ్గర పడిందని అందుకే మొతేరా స్టేడియంకు తన పేరు పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మాట తానేదో సెటైర్ వేయడానికి చెప్పట్లేదని, వాస్తవానికి బీజేపీ సంప్రదాయం ఇదేనని, ఆ విషయాన్ని తాను గుర్తు చేస్తున్నానని బాఘేల్ అన్నారు. బుధవారం ఆయన రాయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘భారతీయ జనతా పార్టీకి ఒక సంప్రదాయం ఉంది. అటల్ బిహారీ వాజిపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ‘అటల్ చౌక్’ అని పేరు పెట్టారు. కానీ ఆయన ఆ తర్వాత ప్రధాని పదవి కోల్పోయారు. ఇప్పుడు మొతేరా క్రికెట్ స్టేడియంకు నరేంద్రమోదీ పేరు పెట్టారు. దీన్ని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే నరేంద్రమోదీ ప్రధాని నుంచి మాజీ ప్రధాని కాబోతున్నారనేది స్పష్టం’’ అని భూపేష్ బాఘేల్ అన్నారు.


ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని మొతెరా క్రికెట్ స్టేడియం పేరు మారిపోయింది. పునర్నిర్మాణానికి ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అని ఉన్న ఈ పేరును తాజాగా నరేంద్రమోదీ స్టేడియంగా పేరుగా మార్చారు. ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ మ్యాచ్‌కి ముందు ఈ పేరు మార్చినట్లు బుధవారం ప్రకటించారు. ఈ స్టేడియంకు సర్దార్ పేరు ఉన్నప్పటికీ మొతేరా అనే ప్రాంతంలో ఉండడం వల్ల దీనిని వాడుకలో మొతేరా స్టేడియం అని కూడా పిలుస్తుంటారు.

Updated Date - 2021-02-25T02:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising