ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhopal gas tragedy జరిగి నేటికి 37 ఏళ్లు...బాధితులకు ఇంకా అందని పరిహారం

ABN, First Publish Date - 2021-12-03T15:56:44+05:30

భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి సరిగ్గా నేటికి 37 ఏళ్లు గడచింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి సరిగ్గా నేటికి 37 ఏళ్లు గడచింది. 1984వ సంవత్సరంలో డిసెంబరు 2-3 మధ్యరాత్రి భోపాల్ నగరంలోని యూనియన్ కార్బైడ్ ప్లాంట్ లో విషవాయువు లీక్ అయింది. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్)కి చెందిన పురుగుమందుల ప్లాంట్ నుంచి గ్యాస్ లీక్ కారణంగా 1984లో వేలాది మంది మరణించారు.భోపాల్‌లోని పాడుబడిన యూనియన్ కార్బైడ్ ప్లాంట్ ముందు 1984 గ్యాస్ దుర్ఘటన 37వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సంభావన ట్రస్ట్ క్లినిక్ సభ్యులు కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు. మిథైల్ ఐసోసైనేట్ వాయువు, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ లాంటి అత్యంత విషపూరిత పదార్థాల బారిన 5 లక్షలమంది పడ్డారు.


ఈ విష వాయువు వల్ల 3,787 మంది మరణించగా, 5.58 లక్షల మంది ఈ గ్యాస్ వల్ల ప్రభావితమయ్యారని అధికార అంచనా. కాగా ఈ విషవాయువు వల్ల 25వేల మంది మరణించారని బాధితుల తరపున పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలు ఆరోపించాయి.భోపాల్ దుర్ఘటన జరిగి 37 ఏళ్లు గడిచినా ఇంకా బాధితులు పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.2004వ సంవత్సరంలో 3,000 కోట్ల పరిహారాన్ని విడుదల చేయగా, దాన్ని బాధితులు వారికి అందాల్సిన పరిహారంలో ఐదవ వంతును పొందారు. మిగిలిన పరిహారం కోసం గ్యాస్ బాధితులు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. 

Updated Date - 2021-12-03T15:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising