ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవానీపూర్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2021-09-15T04:47:38+05:30

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ భవానీపూర్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 15 కంపెనీల కేంద్ర బలగాలను బెంగాల్‌ పంపించాలని నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ భవానీపూర్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 15 కంపెనీల కేంద్ర బలగాలను బెంగాల్‌ పంపించాలని నిర్ణయించింది. భవానీపూర్‌లో ఈ నెల 30న ఉపఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్‌నుంచి పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్‌లో ఆమె సుబేందు అధికారిపై ఓటమి పాలయ్యారు. అయితే నందిగ్రామ్ ఫలితంపై ఆమె కోర్టుకు వెళ్లారు. ఈ విషయంపై విచారణను కోర్టు వాయిదా వేయడంతో మమత భవానీపూర్‌నుంచి పోటీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా గెలవకపోతే ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగలేరు. దీంతో ఆమె తన సొంత నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నామినేషన్ కూడా వేశారు.  భవానీపూర్‌లోనూ మమతను ఓడిస్తామని బీజేపి తరపున పోటీ చేస్తున్న ప్రియాంక తిబ్రేవాల్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హింస చెలరేగిన నేపథ్యంలో ఉప ఎన్నిక సందర్భంగా ఆ తరహా ఘటనలు పునరావృతం కావొద్దని ఈసీ యోచిస్తోంది. అందుకే బెంగాల్‌కు 15 కంపెనీల కేంద్ర బలగాలను పంపాలని నిర్ణయించింది.  

Updated Date - 2021-09-15T04:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising