ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhabanipur: బీజేపీ అభ్యర్థిని ప్రియాంక నేడు నామినేషన్ దాఖలు

ABN, First Publish Date - 2021-09-13T13:39:32+05:30

భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిని ప్రియాంక తిబ్రేవాల్ సోమవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భవానీపూర్ (పశ్చిమబెంగాల్): భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిని ప్రియాంక తిబ్రేవాల్ సోమవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.భవానీపూర్ పట్టణంలోని గోడపై భాజపా ఎన్నికల చిహ్నమైన కమలం గుర్తును చిత్రీకరించడం ద్వారా ప్రియాంక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. భవానీపూర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన సీఎం మమతాబెనర్జీ ఇప్పటికే నామినేషన్ వేశారు.టీఎంసీ హింసాకాండపై న్యాయపోరాటం చేస్తున్న న్యాయవాది అయిన ప్రియాంక ఎన్నికల బరిలోకి దిగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ‘‘పశ్చిమ బెంగాల్ ప్రజలకు జీవించే హక్కు ఉంది. ఈ హక్కును మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వారి నుంచి లాగేసుకుంది, అందుకే నేను బెంగాల్ ప్రజల కోసం పోరాడుతున్నాను’’ అని ప్రియాంక తిబ్రేవాల్ చెప్పారు. 


బీజేపీ అభ్యర్థినిగా ప్రకటించాక ప్రియాంక కోల్‌కతాలోని కలిఘాట్ దేవాలయాన్ని సందర్శించారు, అక్కడ ఆమె భవానీపూర్ పోరాటానికి ముందు కాళీ దేవికి ప్రార్థనలు చేశారు. బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ఉండాలంటే నవంబరు 5వతేదీ లోగా ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. గతంలో భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థి చటోపాధ్యాయ్ 28వేల ఓట్ల ఆధిక్యతతో విజయఢంకా మోగించారు. సీఎం పోటీచేసేందుకు వీలుగా చటోపాధ్యాయ్ భవానీపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఉపఎన్నిక జరగనుంది. భవానీపూర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని ప్రకటించింది.


Updated Date - 2021-09-13T13:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising