ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగాల్ బీజేపీ మహిళా నేతల చిత్రాలతో పోస్టర్

ABN, First Publish Date - 2021-02-27T18:25:43+05:30

పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆ రాష్ట్ర మహిళా నాయకురాళ్ల చిత్రాలతో వినూత్న పోస్టరును శనివారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆ రాష్ట్ర మహిళా నాయకురాళ్ల చిత్రాలతో వినూత్న పోస్టరును శనివారం విడుదల చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతాబెనర్జీని లక్ష్యంగా చేసుకొని ‘‘బెంగాల్ తన సొంత కుమార్తెను కోరుకుంటుందని, ‘పిషి’ కాదు అంటూ టీఎంసీ ప్రచార నినాదానికి దీటుగా బీజేపీ మహిళానేతలతో పోస్టరు రూపొందించారు. పిషి అంటే పితృ అత్తకు ఉపయోగించే బెంగాలీ పదం.‘‘బెంగాల్ వాంట్స్ ఇట్స్ ఓన్ డాటర్, పిషి కాదు’’ అనే నినాదంతో బీజేపీ పోస్టర్‌ను ట్వీట్ చేసింది.ఈ పోస్టరులో బెంగాల్ కు చెందిన 9 మంది బీజేపీ నాయకురాళ్ల ముఖాల చిత్రాలు ప్రచురించారు. 


బీజేపీ ప్రచార పోస్టరులో రూపా గంగూలీ, దేబోశ్రీ చౌదరి, లాకెట్ ఛటర్జీ, భారతి ఘోష్, అగ్నిమిత్రపాల్ తదితరులున్నారు. పోస్టరులో మమతాబెనర్జీని ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పిషి-బైపో అని ఎగతాళి చేసేలా బీజేపీ ప్రచార పోస్టరును రూపొందించింది. మమతాబెనర్జీ ఆమె మేనల్లుడు వంశ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు పలువురు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-02-27T18:25:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising