ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pegasus వ్యవహారంపై దర్యాప్తు.. పశ్చిమబెంగాల్ సంచలన నిర్ణయం!

ABN, First Publish Date - 2021-07-26T20:54:32+05:30

పెగాసస్ స్పైవేర్‌ నిఘా నీడ భారతీయులపై పడిందన్న ఆరోపణలకు సంబంధించి నిజానిజాలను వెలికి తీసేందుకు బెంగాల్ ప్రభుత్వం సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పెగాసస్ స్పైవేర్‌ నిఘా నీడ భారతీయులపై పడిందన్న ఆరోపణలకు సంబంధించి నిజానిజాలను వెలికి తీసేందుకు బెంగాల్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ఇద్దరు మాజీ న్యాయమూర్తులతో ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్య, జస్టిస్ ఎం.బీ. లోకుర్ ఈ అంశంపై దృష్టి సారించనున్నారు. పెగాసస్ వ్యవహారంపై దేశంలో అధికారికంగా చేపడుతున్న తొలి దర్యాప్తు ఇదే కావడంతో ఈ పరిణామానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 


‘‘కేంద్రమే ఓ ఎంక్వైరీ కమిషన్ ద్వారాగానీ లేదా కోర్టు ద్వారా గానీ దర్యాప్తు ప్రారంభిస్తుందనుకున్నాం. కానీ..కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు కూర్చుంది. దీంతో..మేమే ఓ దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం. ఈ తొలి అడుగు ఇతరులకు మేలుకొలుపుగా మారుతుందని ఆశిస్తున్నా’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. కాగా.. 2017 నుంచి 2019 మధ్య కాలంలో ఓ భారతీయ క్లైయింట్ కొందరు ప్రముఖలపై పెగాసస్ ద్వారా నిఘా పెట్టినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రముఖల పేర్లున్న ఓ జాబితా కూడా విడుదల చేసింది. ఈ లిస్టులో బెంగాల్ సీఎం మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు.

Updated Date - 2021-07-26T20:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising