బెంగళూరులో మొత్తం కరోనా యాక్టివ్ కేసులు ఎన్నో తెలిస్తే...
ABN, First Publish Date - 2021-09-29T16:39:04+05:30
రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. మంగళవారం విడుదలైన బులెటిన్ ప్రకారం 629 మందికి పాజిటివ్ ప్రబలగా 782 మంది కోలుకున్నారు. దీంతో యాక్టివ్‌కేసులు 13 వేలలోపే ఉన్నాయి.
బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. మంగళవారం విడుదలైన బులెటిన్ ప్రకారం 629 మందికి పాజిటివ్ ప్రబలగా 782 మంది కోలుకున్నారు. దీంతో యాక్టివ్‌కేసులు 13 వేలలోపే ఉన్నాయి. ప్రస్తుతం 30 జిల్లాల్లో 12,634 మంది చికిత్సలు పొందుతున్నారు. ఏడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 17 మంది మృతిచెందగా బెంగళూరులో ఆరుగురు, బెళగావిలో ముగ్గురు, దక్షిణకన్నడ, హాసన్‌లలో ఇద్దరు చొప్పున, నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. అత్యధికంగా బెంగళూరులో 7,418మంది చికిత్సలు పొందుతున్నారు.
Updated Date - 2021-09-29T16:39:04+05:30 IST