ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'బాండిష్ బాండిట్స్' నటుడు అమిత్‌ మిస్త్రీ కన్నుమూత

ABN, First Publish Date - 2021-04-23T23:29:46+05:30

ప్రముఖ గుజరాతీ, హిందీ నటుడు అమిత్‌ మిస్త్రీ శుక్రవారంనాడు గుండెపోటుతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రముఖ గుజరాతీ, హిందీ నటుడు అమిత్‌ మిస్త్రీ శుక్రవారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 47 సంవత్సరాలు. అంధేరితో తన తల్లితో కలిసి మిస్త్రీ నివసిస్తున్నారని, ఉదయం 9.30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారని మిస్త్రీ మేనేజర్ మహర్షి దేశాయ్ తెలిపారు. 'షోర్ ఇన్ ది సిటీ', 'బే యార్', అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ 'బాండిష్ బాండిట్స్' మిస్త్రీకి మంచి పేరు తెచ్చాయి.


'ఉదయమే మిస్త్రీ లేచారు. బ్రేక్ పాస్ట్ తీసుకున్నారు. గుండెపోటు రాకముందు వ్యాయామం కూడా చేశారు. మంచి ఫిటెన్‌స్‌తో ఉన్న ఆయన గుండెపోటుకు గురవడం దిగ్భ్రాంతికి గురిచేసింది' అని మహర్షి దేశాయ్ మీడియోకు తెలిపారు. గుజరాతీ రంగస్థల కళాకారుడిగా మిస్త్రీకి మంచి పేరుంది. హిందీ చిత్రాలు 'క్యా కెహ్నా', 'ఏక్ చాలిస్ కి లాస్ట్ లోకల్', 'షోర్ ఇన్ ది సిటీ', 'ఎ జెంటిల్‌మన్'లో నటించారు. మ్యుజిషియన్ దేవేంద్ర రాథోడ్‌గా ఆయన నటించిన 'బాండిష్ బాండిట్స్' మంచి గుర్తింపు తెచ్చింది. మిస్త్రీ ఆకస్మిక మృతి ఆయన అభిమానులను, పరిశ్రమ వర్గాలను విషాదంలో ముంచింది.

Updated Date - 2021-04-23T23:29:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising