ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ballariలో.. దిగ్గజాల మధ్య పోటీ

ABN, First Publish Date - 2021-11-28T18:46:19+05:30

బళ్లారి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి కేసీ కొండయ్య, బీజేపీ అభ్యర్థి వైఎం సతీష్‌ ఇద్దరు దిగ్గజాల మధ్య దీటైన పోటీ సాగుతోంది. ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

             - పరిషత్‌ పోరులో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కేసీ, వైఎంఎస్‌


బళ్లారి(బెంగళూరు): బళ్లారి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి కేసీ కొండయ్య, బీజేపీ అభ్యర్థి వైఎం సతీష్‌ ఇద్దరు దిగ్గజాల మధ్య దీటైన పోటీ సాగుతోంది. ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీలు ఎత్తులు వేస్తున్నాయి. రాజకీయ కురరుద్దుడు కేసీ కొండయ్య వ్యూహత్మకంగా ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి వైఎం సతీష్‌ రాజకీయంగా కొత్త కావడంతో పార్టీలో ఇతరుల మీద ఆధారపడుతునున్నట్లు కనిపిస్తోంది. బళ్లారి, విజయనగర జిల్లాలోని అన్ని తాలూకాల్లో గ్రామపంచాయతీలు, పట్టణ పంచాయతీలు, పురసభ, నగరసభలల్లో ఉండే ఓటర్లను ఇప్పటికే కేసీ కొండయ్య రెండు మూ డు దపాలు నేరుగా కలిసి ప్రచారం చేసుకున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ నుండి గెలిచిన ఓటర్లతో పాటు బీజేపీ నుండి గెలిచిన ఓటర్లతో కూడా నేరుగా పరిచయాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి వైఎం సతీష్‌ రాజకీయంగా పూ ర్తిగా కొత్త. గ్రామాల్లో ఇంతకు ముందు పర్యటించిన ధాఖలాలు లేవు. ఆయన రాజకీయంగా ఏ అడుగు వేయాలన్నా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఆగర్భ శ్రీ మంతుడు కావడం, ఆర్‌ఎస్ఎస్‌తో మంచి పరిచయాలు ఉండడం ఆయనకు కలిసొచ్చిన అంశం. కొత్తవాడు అవకాశం ఇవ్వండి మంచి చేస్తాడు అనే ప్రచారం ను బీజేపీ నాయకులు చేస్తున్నారు. రాష్ట్రం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కవ స్థానాలు గెలవాలని పట్టుదలతో బీజేపీ నాయకులు భావిస్తున్నారు. గతంలో కార్పొరేట్‌ ఎన్నికల్లో బీజేపీ బళ్లారిని కాంగ్రెస్‌ చేతికి ఇచ్చేసింది. ఈసారి అలాంటి తప్పు జరగకుండా కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ అధిష్టాన వర్గం గట్టిగా చెప్పినట్లు బీజేపీ నాయకులు కొందరు బహిరంగంగా చెబుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరూ శ్రీమంతులే. ఇక ఆర్థికంగా ఓటర్లకు తాయిలాలు ఇవ్వడంలో వెనుకంజ వేయరనే ప్రచారం కూడా సాగుతోంది. మెత్తం మీద బళ్లారి లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారింది. 

Updated Date - 2021-11-28T18:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising