ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బళ్లారిలో మైనింగ్‌ కళాశాల ఏర్పాటుకు అనుమతి

ABN, First Publish Date - 2021-07-16T16:43:22+05:30

బళ్లారి, విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మైనింగ్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలో ఈ కళాశాల ఏర్పాట్లను పరిశీలించేందుకు గనుల శాఖ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బళ్లారి(కర్ణాటక): బళ్లారి, విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మైనింగ్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలో ఈ కళాశాల ఏర్పాట్లను పరిశీలించేందుకు గనుల శాఖ మంత్రి మురుగేశ్‌ నీరాణి బళ్లారికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో అపార ఇనుమ ఖనిజాలు ఉండటంతో సుమారు రూ. 196 కోట్లతో ఈ కళాశాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. కళాశాల ఆవరణంలోని సుమారు 4.5 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.  

దేశంలోనే ఇది రెండోది: దేశంలో ప్రస్తుతం ఇలాంటి కాలేజీ జార్ఖండ్‌లో మాత్రమే ఉంది. బళ్లారిలో ఏర్పాటు చేయబోయేది దేశంలోనే రెండోది కానుందని అధికారులు చెప్పారు. ఇక్కడ ఈ కళాశాల ఏర్పాటు చేస్తే సాంకేతిక పరంగా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని,  నిరుద్యోగ సమస్యనూ అధికమించవచ్చని అభిప్రాయపడ్డారు. కేవలం బళ్లారి జిల్లాలో సుమారు 40కి పైగా ఇనుప గనులున్నాయని, వీటిలో అనేక సాంకేతిక రంగాల్లో వేలాది మంది అవసరం ఉందని అన్నారు. 

Updated Date - 2021-07-16T16:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising