ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోషకాహార లోపంపై ‘ఆయుష్‌’ ఆయుధం

ABN, First Publish Date - 2021-01-25T07:32:53+05:30

తీవ్ర పోషకాహార లోపాన్ని ‘ఆయుష్‌’ వైద్య విధానాల ద్వారా జయించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 24: తీవ్ర పోషకాహార లోపాన్ని ‘ఆయుష్‌’ వైద్య విధానాల ద్వారా జయించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పోషకాహార లోపంతో బాధ పడుతున్న మహిళలు, పిల్లల జాబితాను ఈ నెల 31లోగా సిద్ధం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక లేఖ రాసింది. ‘పోషణ్‌ ట్రాకర్‌’ యాప్‌ ద్వారా  పోషకాహార లోపం ఉన్న వారికి అందుతున్న ఆహారం, వైద్యం తదితర వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. పోషణ్‌ వాటిక(కిచెన్‌, న్యూట్రి గార్డెన్‌)లను ఏర్పాటు చేస్తారు. యోగాపై చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాంప్రదాయ పద్ధతుల ద్వారా  ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పిస్తారు. 2015-16తో పోలిస్తే 2019-20కి పోషకాహార లోపంతో బాధ పడుతున్న పిల్లల సంఖ్య ఎక్కువైందని జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం-5 వెల్లడించిన నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.  

Updated Date - 2021-01-25T07:32:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising