ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికీలీక్స్ ఫౌండర్ అసాంజే విడుదలకు యత్నించాలన్న డిమాండ్లకు ఆస్ట్రేలియా నో

ABN, First Publish Date - 2021-12-12T20:34:02+05:30

వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెరా : వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటిష్ కోర్టు మార్గం సుగమం చేసింది. గూఢచర్యం కేసులో విచారణ ఎదుర్కొనేందుకు అమెరికాకు అప్పగించవచ్చునని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయనను విడుదల చేసే విధంగా జోక్యం చేసుకోవాలని వస్తున్న డిమండ్లను ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించలేదు. తదుపరి చర్యలను ఆయనే నిర్ణయించుకోవాలని తెలిపింది. 


అసాంజే ఆస్ట్రేలియా పౌరుడు. అమెరికాలో ఆయన గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెయిలు షరతులను ఉల్లంఘించడంతో అసాంజేను బ్రిటన్‌లో జైలులో నిర్బంధించారు. ఆయనను తమకు అప్పగించాలని అమెరికా విజ్ఞప్తి చేయడంతో డిసెంబరు 10న బ్రిటన్ కోర్టు ఆమోదం తెలిపింది. ఈ కేసును నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్‌లో న్యాయ ప్రక్రియను గౌరవిస్తామని తెలిపింది. ఈ కేసుకు తాను పార్టీ కానని, తదుపరి చర్యలపై స్పందించవలసినది అసాంజేయేనని పేర్కొంది. ఆయనకు కాన్సులార్ సపోర్ట్ ఇస్తున్నట్లు ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 


ఇదిలావుండగా, బ్రిటిష్ కోర్టు తీర్పు తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవలసినది ఆ దేశ హోం శాఖ కార్యదర్శి ప్రీతీ పటేల్. ఈ నేపథ్యంలో అసాంజేను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. అమెరికా, బ్రిటన్ల నుంచి అసాంజేను విడుదల చేయించాలని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్‌ను ఆ దేశ స్వతంత్ర ఎంపీ ఆండ్రూ విల్కీ కోరారు. 


బ్రిటన్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అపీలు చేసేందుకు అసాంజే తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆయన 2019 నుంచి బెల్‌మార్ష్ జైలులో ఉన్నారు. 


Updated Date - 2021-12-12T20:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising