ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా థర్డ్ వేవ్ వార్తల మధ్య వ్యాక్సినేషన్ వేగవంతం!

ABN, First Publish Date - 2021-08-26T12:37:44+05:30

కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్నదనే వార్తల మధ్య...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్నదనే వార్తల మధ్య దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగవంతమయ్యింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత నెలతో పోల్చిచూస్తే, ప్రస్తుత ఆగస్టులో వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగింది. ఆగస్టులో ప్రతిరోజూ అత్యధికంగా 52.16 లక్షల మందికి టీకాలు వేశారు. జూలైలో ఈ సంఖ్య 45 లక్షలు కూడా దాటలేదు. ఇక జూన్‌లో ప్రతీరోజూ 40 లక్షల మందికి టీకాలు వేశారు. మేలో ఈ సంఖ్య 20 లక్షలుగా ఉంది.  


దేశంలో ఇప్పటివరకూ 60 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ దేశంలో తొలుత 10 కోట్ల మందికి టీకాలు ఇవ్వడానికి 85 రోజులు పట్టిందని, ఆ తరువాత 20 కోట్ల మందికి టీకాలు ఇవ్వడానికి 45 రోజులు పట్టిందని, ఈ సంఖ్య 30 కోట్లకు చేరడానికి 29 రోజులు పట్టిందన్నారు. దేశంలో 30 కోట్లను దాటి 40 కోట్ల మందికి టీకాలు ఇవ్వడానికి 24 రోజులు పట్టిందన్నారు. ఇలా ఆగస్టు 6 నాటికి 50 కోట్ల మందికి టీకాలు ఇవ్వడానికి 20 రోజులు పట్టగా, 60 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం పూర్తిచేయడానికి 19 రోజులు పట్టిందని తెలిపారు. 


Updated Date - 2021-08-26T12:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising