ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రిపుర సీఎంపై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్టు

ABN, First Publish Date - 2021-08-08T07:39:36+05:30

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌పై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్నం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కారుతో ఢీకొట్టేందుకు యత్నించిన దుండగులు..
  • త్రుటిలో తప్పించుకున్న సీఎం

అగర్తల, ఆగస్టు 7: త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌పై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. ముఖ్యమంత్రిని కారుతో ఢీకొట్టేందుకు యత్నించగా త్రుటిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గురువారం అగర్తలలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం వాకింగ్‌కు వెళ్లేందుకు తన నివాసం నుంచి బయల్దేరుతుండగా ముగ్గురు దుండగులు కారులో సీఎం భద్రతా వలయాన్ని ఛేదించుకొని వచ్చారు. భద్రతా సిబ్బంది కారును అడ్డుకొనేందుకు యత్నించినా లాభం లేకపోయింది. కారును గమనించిన ముఖ్యమంత్రి వెంటనే పక్కకు జరిగి తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ వాహనాన్ని అదుపులోకి తీసుకొని అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని వెల్లడించారు. శుక్రవారం కోర్టు వారికి 14 రోజుల జైలుశిక్ష విధించిందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-08T07:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising