ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి: ఆర్మీ కల్నల్ సహా ఏడుగురు మృతి

ABN, First Publish Date - 2021-11-13T21:27:46+05:30

మణిపూర్‌లో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. చురాచాంద్‌పూర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్ పరిధిలో దాడికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంఫాల్: మణిపూర్‌లో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. చురాచాంద్‌పూర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్ పరిధిలో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అసోం రైఫిల్స్ యూనిట్‌కు చెందిన కమాండింగ్ అధికారి విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య అనూజ, కుమారుడు అబీర్, మరో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. కమాండింగ్ అధికారి కల్నల్ విప్లవ్ త్రిపాఠి తన కుటుంబ సభ్యులు, క్విక్ రియాక్షన్ టీమ్‌తో కలిసి కాన్వాయ్‌లో వస్తుండగా ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడికి తామే బాధ్యులమని ఇంతవరకూ ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించలేదు. కాగా, మిలిటెంట్ల దాడి ఘటనను ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు రాష్ట్ర పోలీసులు, పారామిలటరీ సిబ్బంది అవిశ్రాంతంగా పని చేస్తున్నారని, మిలిటెంట్ దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని అన్నారు.


రాజ్‌నాథ్ ఖండన..

అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై మిలిటెంట్ల దాడిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఒక ప్రకటనలో ఖండించారు. ఇది పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. దాడి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. దేశం ఐదు మంది వీరసైనికులను కోల్పోయిందని అన్నారు. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-11-13T21:27:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising