ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోమాంస నిషేధిత బిల్లులో 75 సవరణలు ప్రతిపాదించిన ప్రతిపక్షాలు

ABN, First Publish Date - 2021-08-14T22:04:55+05:30

బుధవారం అస్సాం అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశ పెట్టిన అనంతరం సీఎం హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ ‘‘కొన్ని అంశాలపై రాష్ట్రంలో తీవ్ర ఒత్తిడి పెరిగింది. రాష్ట్ర సరిహద్దుల్లో బీఫ్ రవాణాను నిషేధించాలనే ఒత్తిడి ఉంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువహాటి: హిందూ ప్రార్థన మందిరాలకు 5 కిలోమీటర్ల సమీపంలో గోమాంసం సహా మరే ఇతర మాంసం అమ్మకుండా అస్సాం ప్రభుత్వం చట్టం చేసింది. దీనికి సంబంధించి రూపొందించి ‘ది క్యాటిల్ ప్రిసర్వేషన్ బిల్లు’ను శుక్రవారం అస్సాం అసెంబ్లీ ఆమోదించింది. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లు పూర్తి పక్షపాతంగా ఉందంటూ వెంటనే అందులో 75 సవరణలు చేయాలంటూ ప్రతిపక్ష నేతలు సూచించారు. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ.. బిల్లును ప్రవేశ పెట్టిన అనంతరం ప్రతిపక్ష నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి, అసెంబ్లీ ఆవరణలో నిరసన చేపట్టారు.


ఈ సందర్భంగా ఏఐయూడీఎఫ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమినుల్ ఇస్తామ్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో 1,09,09,327 ఆవులు ఉన్నాయి. అలాంటప్పుడు అంతరించిపోతున్న జాతి అని వాటిని ఎలా పరిగణిస్తారు? దానికి ఇంత కఠినమైన చట్టం ఎలా చేస్తారు? హిందూ మందిరాలకు 5 కిలోమీటర్ల దూరంలో మాంసం అమ్మకూడదంటే.. ప్రతి ఊరిలో గుడి ఉంటుంది, ప్రతి పట్టణంలో కిలోమీటర్ దూరంలో గుడి ఉంటుంది. మరి ఇక అమ్మకాలు ఎక్కడ చేస్తారు? ఈ వ్యాపారంలో ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా బతకాలి?’’ అని అన్నారు.


కాగా, బుధవారం అస్సాం అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశ పెట్టిన అనంతరం సీఎం హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ ‘‘కొన్ని అంశాలపై రాష్ట్రంలో తీవ్ర ఒత్తిడి పెరిగింది. రాష్ట్ర సరిహద్దుల్లో బీఫ్ రవాణాను నిషేధించాలనే ఒత్తిడి ఉంది. అంతే కాకుండా హిందూ దేవాలయాలకు 5 కిలోమీటర్ల సమీపంలో బీఫ్ అమ్మకం నిషేధం. ఇలాంటివి ఇంకొన్ని ఒత్తిడులు రాష్ట్రంపై ఉన్నాయి. అయితే పశువులను కాపాడటం అనేది కేవలం మతానికి సంబంధించిన అంశం కాదు. ఇది ఒక శాస్త్రీయ అంశం. దేవాలయాలు లేకుండా చాలా కిలోమీటర్ల ప్రాంతం ఉంది. 70,000 నుంచి 80,000 ఆవాసాలలో హిందువులే లేరు. మత సామరస్యం బాధ్యత కేవలం హిందువులది మాత్రమే కాదు. ముస్లింలు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి’’ అని అన్నారు.

Updated Date - 2021-08-14T22:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising