ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది చివరికి సరిహద్దు చిక్కుల పరిష్కారం: అసోం సీఎం

ABN, First Publish Date - 2021-11-16T23:31:27+05:30

ఈ ఏడాది చివరికల్లా కనీసం 6 ప్రాంతల్లో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గౌహతి: ఈ ఏడాది చివరికల్లా కనీసం 6 ప్రాంతల్లో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు అసోం, మేఘాలయ రాష్ట్రాలు మంగళవారంనాడు ప్రకటించాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా మంగళవారంనాడిక్కడ మీడియా సంయుక్త సమావేశంలో మాట్లాడారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల సత్వర పరిష్కారానికి ఏర్పాటు చేసిన సరిహద్దు కమిటీలు ఈనెల 30వ తేదీకల్లా తమ నివేదికలు సమర్పిస్తాయని బిస్వా శర్మ ఈ సందర్భంగా తెలిపారు. కమిటీలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పిస్తాయని, అనంతరం ఇరువర్గాలు మధ్య చర్చలు జరుగుతాయని చెప్పారు. అనంతరం ఒక స్పష్టమైన నిర్ణయానికి రావడం, దానిపై ప్రకటన చేయడం జరుగుతుందని అన్నారు.


కమ్రుప్, కమ్రుప్ మెట్రోపాలిటన్, హైలకండి జిల్లాల్లో 12 వివాదాస్పద ప్రాంతాల్లో ఆరు ప్రాంతాల్లో సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలు చెరో మూడు కమిటీలు వేసినట్టు శర్మ చెప్పారు. తొలిదశలో ఆరు ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, అదే వేగం, అదే స్ఫూర్తితో డిసెంబర్ 30 కల్లా తుది ప్రకటన చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు ఆయన తెలిపారు. దీనికి ముందు, ముఖ్యమంత్రులిద్దరూ కమ్రుప్ జిల్లాలోని వివాదాస్పద లాంగ్‌పిహ్ ప్రాంతాన్ని సందర్శించారు.

Updated Date - 2021-11-16T23:31:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising