ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నామినేషన్ వేసిన సీఎం సోనోవాల్

ABN, First Publish Date - 2021-03-09T21:19:29+05:30

అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మంగళవారంనాడు నామినేషన్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గౌహతి: అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మంగళవారంనాడు నామినేషన్ వేశారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో మజులి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. నామినేష్లను గడువు మంగళవారంతో ముగియనున్న తరుణంలో ఆయన మజులి డిప్యూటీ కమిషనర్‌ బిక్రమ్ కైరికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ల సమర్పణకు ముందు ఆయన ఒక భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎన్‌ఈడీఏ కన్వీనర్ హిమాంత బిస్వా శర్మ, ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరా, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రంజిత్ దాత్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి బైజయంత పాండ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల కొనసాగింపునకు, రాష్ట్ర ప్రజలకు సేవలందించేందుకు తనను మరోసారి గెలిపించి, పార్టీకి మళ్లీ అధికారం ఇవ్వాలని సోనావాల్ కోరారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అసాధారణ అభివృద్ధి చేసి చూపించామని చెప్పారు. కాగా, సోనావాల్‌కు పోటీగా రజీబ్ లోచన్ పెగును కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. మజులి నియోజకవర్గానికి 2001 నుంచి మూడుసార్లు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2016 ఎన్నికల్లో సోనోవాల్ చేతిలో 18,923 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈనెల 27న జరిగే తొలి విడత పోలింగ్‌లో మజులి ఉంది.

Updated Date - 2021-03-09T21:19:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising