ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా గురించి అడిగితే కశ్మీర్‌ను లేవనెత్తిన పాక్ ప్రధాని

ABN, First Publish Date - 2021-06-21T21:27:24+05:30

హెచ్‌బీవో జర్నలిస్ట్‌ జోనాథన్‌ స్వాన్‌‌కు ఇమ్రాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ను ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు చాలానే అడిగాడు స్వాన్‌. చైనాలో అక్కడి ప్రభుత్వం పది లక్షల మందికి పైగా ఉయిగుర్లను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏవేవో ప్రస్తావనలు లేవెత్తి అంశాన్ని పక్కదారి పట్టించాలని చూస్తుంటారు. ఈ క్రమంలో తమ తప్పిదాల్ని బలహీనతలను బయటికి ప్రకటించకపోయినప్పటికీ చూసే వారు సులువుగానే అర్థం చేసుకుంటారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాగే ప్రవర్తించారు. తనను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి చైనా గురించి ప్రశ్నించగా.. ఆ విషయం అప్రస్తుతం అంటూనే కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు.


హెచ్‌బీవో జర్నలిస్ట్‌ జోనాథన్‌ స్వాన్‌‌కు ఇమ్రాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ను ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు చాలానే అడిగాడు స్వాన్‌. చైనాలో అక్కడి ప్రభుత్వం పది లక్షల మందికి పైగా ఉయిగుర్లను బందించి హింసిస్తోంది. బలవంతంగా వాళ్లకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయిస్తోంది. పాశ్చాత్య దేశాల్లో నడుస్తున్న ఇస్లామోఫోబియాను నిలదీసే ఇమ్రాన్.. చైనాను ఎందుకు ప్రశ్నించడం లేదని స్వాన్ నిలదీశారు.


ఇది అప్రస్తుతం అని విషయాన్ని దాట వేస్తూనే కశ్మీర్‌లో లక్షల మంది భారతీయ సైన్యం బంధీలో ఉన్నారని, ఇది అంతకంటే తీవ్రమైన విషయమని ట్రాక్ తప్పించే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా విపత్కర పరిస్థితుల్లో ఆదుకున్న చైనాతో తమకు గాఢమైన స్నేహం ఉందని, ఏ విషయమైనా నాలుగు గోడల మధ్యే ఏ విషయమైనా మాట్లాడుకుంటామని ఇమ్రాన్ తెలిపారు.

Updated Date - 2021-06-21T21:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising