ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాచీన కట్టడాలు, మ్యూజియంల మూసివేత కొనసాగింపు

ABN, First Publish Date - 2021-05-13T01:56:40+05:30

కోవిడ్-19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అన్ని ప్రాచీన కట్టడాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అన్ని ప్రాచీన కట్టడాలు, స్మారక కేంద్రాలు, ప్రదర్శన శాలల మూసివేతను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు భారత పురాతత్వ అధ్యయనాల సంస్థ (ఏఎస్ఐ) ప్రకటించింది. వీటిని ఏప్రిల్‌‌లో మూసివేసిన సంగతి తెలిసిందే. 


ఏఎస్ఐ బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం, 2021 ఏప్రిల్ 15న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ రక్షణలో ఉన్న కట్టడాలు, ప్రదేశాలను మూసివేశారు. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి దృష్ట్యా వీటి మూసివేత మే 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగుతుంది. 


ఈ నోటిఫికేషన్‌ను కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన ఆధ్వర్యంలోని కట్టడాలన్నిటినీ మే 31 వరకు మూసివేయాలని నిర్ణయించిందని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 


ఏప్రిల్ 15న ఏఎస్ఐ జారీ చేసిన ఉత్తర్వుల్లో సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్‌ అన్నిటినీ మే 15 వరకు మూసివేస్తున్నట్లు తెలిపింది. ఒక రోజులో దేశవ్యాప్తంగా రెండు లక్షలకుపైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 


Updated Date - 2021-05-13T01:56:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising