ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ashwini vaishnaw : ముందు ఆ రిపోర్టు క్షుణ్ణంగా చదవండి...

ABN, First Publish Date - 2021-07-22T22:04:53+05:30

ఉభయ సభల్లోనూ ‘పెగాసస్ స్పైవేర్’ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :  ఉభయ సభల్లోనూ ‘పెగాసస్ స్పైవేర్’ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభ వేదిక స్పందించారు. ఇలాంటి నివేదికలన్నింటినీ పార్టీలన్నీ ఇప్పటికే ఖండించాయని, అసలు ఆ రిపోర్టులో ఏముందో మొదట సభ్యులందరూ చదవితే బాగుంటుందని అశ్వినీ వైష్ణవ్ చురకలంటించారు. పెగాసస్‌పై గతంలోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయని, అలాంటి వాటికి ఎలాంటి ఆధారాలు లేవని, వాటిని అన్ని పార్టీలూ ఖండించాయని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు కూడా వీటిని తిరస్కరించిందని గుర్తు చేశారు. పెగాసస్‌కు సంబంధించిన స్టోరీ ఓ వెబ్ పోర్టల్‌లో అచ్చైందని, ఈ కథనం విషయంలో చాలా ఆరోపణలు చుట్టుముట్టాయన్నారు. పార్లమెంట్‌ సమావేశాలకు ఒక రోజు ముందే ఈ నివేదికలు వచ్చాయని, ఇదేమీ యాదృచ్చికం కాదని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని, ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచే ప్రయత్నంగా ఈ రిపోర్టు కనిపిస్తోందని అశ్వినీ వైష్ణవ్ దుయ్యబట్టారు. 

Updated Date - 2021-07-22T22:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising