ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీజీ జ్ఞాపకాలను కూల్చేయొద్దు: రాజస్థాన్ సీఎం

ABN, First Publish Date - 2021-08-10T02:24:47+05:30

సబర్మతి ఆశ్రమ్ రీడవలప్‌మెంట్ ప్రాజెక్టు‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ : సబర్మతి ఆశ్రమ్ రీడవలప్‌మెంట్ ప్రాజెక్టు‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారంనాడు వ్యతిరేకించారు. ఆశ్రమం కూల్చివేసి మ్యూజియం నిర్మించాలనే గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం తనకు దిగ్భ్రాతికి కలిగించిందని, ఇది పూర్తిగా అనుచిత నిర్ణయమని అన్నారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంతో మహాత్మాగాంధీ అనుబంధం విడదీయరానిదని, 1917 నుచి 1930 వరకూ సబర్మతి ఆశ్రమంలోనే గాంధీజీ 13 ఏళ్లపాటు గడిపారని పేర్కొన్నారు. ''గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ అండ్ డవలప్‌మెంట్ ప్రాజెక్టు'' కింద రూ.1,2000 కోట్లతో రీడవలప్మెంట్ సబర్మతి ఆశ్రమ్ ప్రాజెక్టును గుజరాత్ ప్రభుత్వం ప్రతిపాదించింది.


మహాత్మాగాంధీ ఏళ్ల తరబడి నివసించిన పవిత్ర ప్రదేశం సబర్మతి ఆశ్రమం అని, గాంధీజీ ఎంతో సాధారణ జీవితం గడుపుతూనే స్వాతంత్ర్య ఉద్యమంలో యావత్ సమాజాన్ని ఏకతాటిపై తెచ్చారని, ఎందరో ఆ వివరాలు తెలుసుకునేందుకు అక్కడకు వస్తుంటారని గెహ్లాట్ అన్నారు. సబర్మతి ఆశ్రమాన్ని కూల్చేసి మ్యూజియం కట్టడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రధాని మోదీ పునరాలోచించాలని, తక్షణం జోక్యం చేసుకుని చారిత్రాత్మిక ఆశ్రమాన్ని పరిరక్షించాలని కోరారు. ఆశ్రమ పవిత్రను కించపరచడం, అపవిత్రం చేయడం జాతిపితను అవమానించడమేనని అన్నారు. గాంధీజీకి చెందిన ఆనవాళ్లంటినీ తుడిచివేసే రాజకీయ ప్రయత్నంగానే ఈ చర్య కనిపిస్తోందని గెహ్లాట్ తప్పుపట్టారు.

Updated Date - 2021-08-10T02:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising