ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lakhimpur Kheri హింస: మంత్రి కుమారుడికి 3 రోజుల కస్టడీ

ABN, First Publish Date - 2021-10-12T01:05:15+05:30

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింస ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన కేంద్ర మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖింపూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింస ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను కోర్టు మూడు రోజుల పోలీస్ రిమాండ్‌‌కు పంపింది. ఈ నెల 3న లఖింపూర్ ఖేరిలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లో ఆశిష్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఆశిష్‌ను శనివారం 12 గంటలపాటు విచారించిన పోలీసులు అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆశిష్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనను ఇంకా విచారించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందన్న పోలీసుల అభ్యర్థనతో ఆశిష్‌ను కోర్టు మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. 

Updated Date - 2021-10-12T01:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising