ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండదు’

ABN, First Publish Date - 2021-11-09T17:40:08+05:30

రాష్ట్రంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైనుగానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌నుగానీ మార్చే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- స్పష్టం చేసిన అరుణ్‌సింగ్‌ 

- కాంగ్రెస్‌ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం 


బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైనుగానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌నుగానీ మార్చే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం నగరానికి విచ్చేసిన ఆయన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీఎం, అధ్యక్షుడి మార్పు కథనాలు కేవలం ఊహాజనితమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి వదంతులను సృష్టించడంలో మహా దిట్ట అని చురకలంటించారు. కాంగ్రెస్‌ ప్రజలపక్షాన పనిచేయడం ఏనాడో మానేసిందన్నారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల పార్టీకి ఎదురుదెబ్బలు తగిలిన మాట నిజమేనని అంగీకరించిన ఆయన దీన్ని ప్రజా వ్యతిరేకతగా భావించరాదన్నారు. సిందగిలో తమ పార్టీ అభ్యర్థి 31ఓట్ల మెజారిటీతో గెలుపొందారని, హానగల్‌లో కొద్దిపాటి తేడాతో ఓడిపోయామన్నారు. ఈ ఓటమిపై మంగళవారం జరిగే నేతల సమావేశంలో ఆత్మావలోకనం చేసుకుంటామన్నారు. రాష్ట్రంలో జరుగనున్న విధానపరిషత్‌, ఇతర ఎన్నికలపై కూడా చర్చలు జరుపుతామన్నారు. బొమ్మై ప్రభుత్వ పనితీరు బాగానే ఉందంటూ ఆయన కితాబునిచ్చారు. 

Updated Date - 2021-11-09T17:40:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising