ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంటార్కిటికాలో 3600 కిలోమీటర్ల నడక!

ABN, First Publish Date - 2021-12-25T09:17:59+05:30

భవిష్యత్తులో మనిషి అంగారకుడి(మార్స్‌)పైకి వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులకు మానవ శరీరం ఏ విధంగా స్పందిస్తుంది? ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మార్స్‌పై పరిస్థితులను అంచనా వేసేందుకు నాసా..

 ఈఎ్‌సఏ పర్యవేక్షణలో ఇద్దరు బ్రిటన్‌ సాహసికుల యత్నం

న్యూఢిల్లీ, డిసెంబరు 24: భవిష్యత్తులో మనిషి అంగారకుడి(మార్స్‌)పైకి వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులకు మానవ శరీరం ఏ విధంగా స్పందిస్తుంది? ఎలా అలవాటుపడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు బ్రిటన్‌ పరిశోధకులు జస్టిన్‌ పాక్షా, జేమీ ఫేసెస్‌ చిల్డ్స్‌ అంటార్కిటికాలో 3600 కిలోమీటర్ల మేర నడిచే సాహసయాత్రను చేపట్టారు. నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈఎ్‌సఏ) సంయుక్తంగా పర్యవేక్షిస్తున్న ఈ యాత్ర నెల రోజుల క్రితం మొదలైంది. మైనస్‌ 55 డిగ్రీల సెల్సియస్‌ వరకూ నమోదయ్యే అంటార్కిటికాలో మనిషి శారీరక, మానసిక పరిధులను పరీక్షించడంతో పాటు.. అంగారకుడిపై అలవాటుపడటం సాధ్యమేనా అన్న కోణంలోనూ అధ్యయనం చేసేందుకు ఈ యాత్ర ఉపకరిస్తుందని ఈఎ్‌సఏ తెలిపింది. 80 రోజులు సాగే యాత్రలో.. మంచుఖండంపై పరిస్థితుల గురించి వారి ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొంది. 

Updated Date - 2021-12-25T09:17:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising