ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో చేరిన మరో టీఎంసీ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-03-03T03:21:15+05:30

తాను వ్యక్తిగత స్వలాభాల కోసం బీజేపీలో చేరలేదని బీజేపీలో చేరిన అనంతరం జితేంద్ర చెప్పుకొచ్చారు. దేశంలో మోదీ అభివృద్ధి చూసి రాష్ట్ర అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోనే బీజేపీలో చేరానని అన్నారు. జితేంద్ర గతేడాది డిసెంబర్‌లో టీఎంసీకి రాజీనామా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు కమలం పార్టీ వైపు కట్టిన క్యూ తగ్గడం లేదు. తాజాగా టీఎంసీ నుంచి రెండు సార్లు ఎమ్యేల్యే, ఒకసారి మేయర్ అయిన జితేంద్ర తివారీ భారతీయ జనతా పార్టీలో చేరారు. హుగ్లీలో మంగళవారం నిర్వహించిన ఓ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆధ్వర్యంలో ఆయన కమల పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతకాలంగా టీఎంసీ పట్ల అసంతృప్తితో కొద్ది రోజుల క్రితమే మమతా పార్టీని వీడిన జితేంద్రను తమవైపుకు తిప్పుకోవడానికి బీజేపీ చాలా కాలం నుంచే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని అనుకున్నారో ఏమో.. కమలం నేతల ఆహ్వానాన్ని స్వీకరించారు.


కాగా, తాను వ్యక్తిగత స్వలాభాల కోసం బీజేపీలో చేరలేదని బీజేపీలో చేరిన అనంతరం జితేంద్ర చెప్పుకొచ్చారు. దేశంలో మోదీ అభివృద్ధి చూసి రాష్ట్ర అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోనే బీజేపీలో చేరానని అన్నారు. జితేంద్ర గతేడాది డిసెంబర్‌లో టీఎంసీకి రాజీనామా చేసి బయటికి వచ్చారు. అయితే టీఎంసీకి జితేంద్ర రాజీనామా చేసిన సమయంలో బీజేపీ నేత బాబుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తివారీని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి అంగీకరించేది లేదని, తాను ఎంతమాత్రమూ ఒప్పుకోనని డిమాండ్ చేశారు. ఈయనకు బీజేపీ నేతలు అగ్నిమిత్ర పాల్, సయంతన్ బసు మద్దతుగా నిలిచారు. వీరిద్దరికీ హైకమాండ్ నుంచి నోటీసులు రావడంతో సైలెంట్ అయిపోయారు.

Updated Date - 2021-03-03T03:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising