ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ పదవికి తీవ్ర పోటీ!

ABN, First Publish Date - 2021-11-12T17:09:53+05:30

అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి కోసం ఆ పార్టీకి చెందిన ఆరుగురు నేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ పదవిలో ఉన్న ఆ పార్టీ సీనియర్‌ నేత మధుసూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - రేసులో ఆరుగురు?


అడయార్‌(చెన్నై): అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి కోసం ఆ పార్టీకి చెందిన ఆరుగురు నేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ పదవిలో ఉన్న ఆ పార్టీ సీనియర్‌ నేత మధుసూదన్‌ ఇటీవల మరణించారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే వున్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం ఎన్నికలు నిర్వహిం చాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అయితే, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నిక వ్యవహారంపై కోర్టులో కేసు సాగుతోంది. ఇది ఈనెల 23వ తేదీకి వాయిదా వేశారు. ఇదిలావుండగా ఈ పదవిని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు ఆరుగురు పోటీ పడుతున్నారు. అన్నాడీఎంకేలో ప్రిసీడియం చైర్మన్‌ పదవిని గత 1972లో సృష్టించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆరుగురు ఆ బాధ్యతలను నిర్వహించారు. వీరిలో మధుసూదనన్‌ అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ గత 2007 నుంచి ఇటీవల మరణించేంత వరకు కొనసాగారు. దీంతో ఆ పదవిని ఎంతో గౌరవప్రదమైన పోస్టుగా భావిస్తారు. అయితే, ఆయన మరణించిన తర్వాత ఈ పదవి ఖాళీగా వుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఆ పార్టీ కార్యవర్గం, సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలోనే ప్రిసీడియం చైర్మన్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్న తర్వాత పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఆ తర్వాతే ప్రిసీడియం చైర్మన్‌ను ఎన్నుకోవాలని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి దామోదరన్‌... ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేయా లని కోరుతూ పార్టీ సమన్వయకకర్త, ఉప సమన్వయకర్తకు నోటీసులు జారీచేస్తూ కేసు విచారణనను ఈనెల 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఆ పదవికి సీని యర్‌ నేతలు సి.పొన్నయ్యన్‌, మాజీ స్పీకర్‌ ధనపాల్‌, జేసీడీ ప్రభాకరన్‌, తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌, డి.జయకుమార్‌, దిండుగల్‌ శ్రీనివాసన్‌ పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరిని ఈ పదవి వరిస్తుందన్నది అన్నాడీఎంకేలో ఆసక్తిగా మారింది. 

Updated Date - 2021-11-12T17:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising