ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూజిలాండ్‌లో ఐసిస్ ఉగ్రవాది బీభత్సం

ABN, First Publish Date - 2021-09-03T20:17:48+05:30

ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రేరేపిత ఉగ్రవాది ఒకడు న్యూజిలాండ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రేరేపిత ఉగ్రవాది ఒకడు న్యూజిలాండ్ సూపర్ మార్కెట్లో బీభత్సం సృష్టించాడు. శుక్రవారం ఉదయం ఓ సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి, విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆరుగురు సామాన్యులు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటికే ఈ ఉగ్రవాదిని పట్టుకోవడానికి నిఘా పెట్టిన పోలీసులు ఆ ఉగ్రవాదిని కాల్చి చంపేశారు. ఈ వివరాలను న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసింద ఆర్డెర్న్ వెల్లడించారు. 


ఆర్డెన్ తెలిపిన వివరాల ప్రకారం, శ్రీలంక జాతీయుడైన ఓ వ్యక్తి 2011లో న్యూజిలాండ్‌కు వెళ్ళాడు. ఆ వ్యక్తి టెర్రర్ వాచ్‌లిస్ట్‌లో ఉన్నాడు. సబర్బన్ ఆక్లాండ్‌లోని ఓ సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి, అక్కడ ఉన్న ఓ కత్తిని తీసుకుని, సమీపంలో ఉన్నవారిని పొడుచుకుంటూ వెళ్ళాడు. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అప్పటికే ఆ ఉగ్రవాదిపై నిఘా పెట్టిన పోలీసులు 60 సెకండ్లలోనే స్పందించి, అతనిపై కాల్పులు జరిపి, మట్టుబెట్టారు. 


‘‘ఈ రోజు జరిగినది చాలా హేయమైన సంఘటన. ఇది విద్వేషపూరితం, చాలా తప్పు’’ అని ప్రధాన మంత్రి జసింద చెప్పారు. ఇది ఏ మతానికి, విశ్వాసానికి ప్రాతినిధ్యం వహించబోదన్నారు. ఇది చాలా హింసాత్మక భావజాలమని చెప్పారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రేరణతో ఈ సంఘటన జరిగిందన్నారు. ఈ వ్యక్తిపై 2016 నుంచి నిఘా పెట్టామన్నారు. 


పోలీస్ కమిషనర్ ఆండ్రూ కోస్టర్ మాట్లాడుతూ, ఈ ఉగ్రవాది ఒంటరిగానే వ్యవహరిస్తున్నాడని, ఇకపై కమ్యూనిటీకి ఎటువంటి హాని జరగబోదని చెప్పారు. 


Updated Date - 2021-09-03T20:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising