ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షా అధ్యక్షతన ఎన్‌ఎస్ఏ సహా రా, ఐబీ, సీఆర్పీఎఫ్ అధనేతల భేటీ

ABN, First Publish Date - 2021-06-19T00:17:35+05:30

కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అమిత్ షాను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కలుసుకున్న అనంతరం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు అభివృద్ధిపై మనోజ్ సిన్హాతో అమిత్ షా చర్చించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటలీజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ అర్వింద్ కుమార్, రీసర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) చీఫ్ సమంత్ కుమార్ గోయెల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కుల్‌దీప్ సింగ్‌తో పాటు జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ హాజరయ్యారు.


కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అమిత్ షాను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కలుసుకున్న అనంతరం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు అభివృద్ధిపై మనోజ్ సిన్హాతో అమిత్ షా చర్చించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి తాజాగా ఓ లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దులు మార్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో ఖరేషి ఫిర్యాదు చేశారు. అయితే విషయమై గురువారం స్పందించిన భారత్.. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, దానిపై మళ్లీ ఎలాంటి ప్రశ్నలు అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated Date - 2021-06-19T00:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising