ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ సలహాదారుగా అమిత్ ఖరే

ABN, First Publish Date - 2021-10-13T01:50:29+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సలహాదారుగా ఉన్నత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సలహాదారుగా ఉన్నత విద్యా శాఖ మాజీ కార్యదర్శి అమిత్ ఖరే మంగళవారం నియమితులయ్యారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో రెండేళ్ళపాటు కాంట్రాక్టు ప్రాతిపదికపై ఈ పదవిని నిర్వహిస్తారని ప్రభుత్వ ఆదేశాలు తెలిపాయి. ఆయన నియామకానికి కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది.  1985 బ్యాచ్ జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అమిత్ సెప్టెంబరు 30న పదవీ విరమణ చేశారు.


మోదీ నిర్దేశకత్వంలో రూపొందిన జాతీయ విద్యా విధానం, 2020 రూపకర్తల్లో అమిత్ ఖరే ఒకరు. డిజిటల్ మీడియా నిబంధనల విషయంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో కీలక మార్పులు తేవడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. 


మాజీ కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా, మాజీ కార్యదర్శి అమర్‌జీత్ సిన్హా ప్రధాన మంత్రి కార్యాలయంలో సలహాదారుల పదవుల నుంచి ఈ ఏడాది వైదొలగిన నేపథ్యంలో అమిత్ ఖరే నియామకం జరిగింది. ఆయన అత్యంత పారదర్శకతతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ, సమర్థులుగా పేరు సంపాదించుకున్నారు. 


ఆయన మానవ వనరుల అభివృద్ధి శాఖలో ఉన్నత విద్య, పాఠశాలల శాఖకు నేతృత్వం వహించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా ఆయన నాయకత్వం వహించారు. 


Updated Date - 2021-10-13T01:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising