అమెరికా టీవీ రంగ దిగ్గజం లారీ కింగ్ మృతి
ABN, First Publish Date - 2021-01-24T08:35:49+05:30
అమెరికన్ టెలివిజన్ రంగంలో దిగ్గజంగా పేరొందిన లారీ కింగ్(87) శనివారం కన్నుమూశారు...
అమెరికన్ టెలివిజన్ రంగంలో దిగ్గజంగా పేరొందిన లారీ కింగ్(87) శనివారం కన్నుమూశారు. కొవిడ్ కారణంగా ఈ నెల 2న ఆయన లాస్ ఏంజిలి్సలోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్లో చేరినట్లు సీఎన్ఎన్ చానెల్ వెల్లడించింది. అక్కడ చికిత్స పొందుతున్న లారీ, శనివారం మృతిచెందారు. తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో లారీ ఏకంగా 50వేల ఇంటర్వ్యూలను నిర్వహించారు.
Updated Date - 2021-01-24T08:35:49+05:30 IST