ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా బలం చైనాకు తెలుసు: అమెరికా హెచ్చరిక

ABN, First Publish Date - 2021-10-22T21:42:18+05:30

తైవాన్‌తో అమెరికాకు ఉన్న ఒప్పందాల్లో ఎలాంటి మార్పు లేదని, ఆ పాలసీలనే ఇకపై కూడా కొనసాగిస్తామని బైడెన్ స్పష్టం చేశారు. తైవాన్‌ను చైనా నుంచి కాపాడతామని చైనాకు పరోక్షంగా హెచ్చరిక చేశారు. అయితే తైవాన్-చైనాలను ఏకం చేసి తీరుతామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: తమ బలమేంటో చైనా, రష్యా సహా ప్రపంచం మొత్తానికి తెలుసని, తైవాన్‌పై చైనా దాడికి దిగితే తాము తైవాన్‌ను రక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. తమ బలం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచంలోనే తాము అత్యంత శక్తివంతమైన మిలిటరీ దేశమని ఆయన పేర్కొన్నారు. చైనా-తైవాన్ ఉద్రిక్తల నేపథ్యంలో తాజాగా ఓ ప్రకటనలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్ విషయంలో చైనా కొన్నాళ్లుగా అతివాద ధోరణి ప్రదర్శిస్తోంది. తైవాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం తైవాన్ గగనతలంలోకి 52 యుద్ధవిమానాలను చైనా పంపింది. కొద్ది రోజులుగా చైనా ఇదే తరహాలో కవ్వింపు చర్యలకు దిగుతోంది.


కాగా, తైవాన్‌తో అమెరికాకు ఉన్న ఒప్పందాల్లో ఎలాంటి మార్పు లేదని, ఆ పాలసీలనే ఇకపై కూడా కొనసాగిస్తామని బైడెన్ స్పష్టం చేశారు. తైవాన్‌ను చైనా నుంచి కాపాడతామని చైనాకు పరోక్షంగా హెచ్చరిక చేశారు. అయితే తైవాన్-చైనాలను ఏకం చేసి తీరుతామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, చైనాకు తైవాన్‌ కూడా గట్టిగానే బదులిస్తోంది. చైనా ఒత్తిళ్లకు, బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేసింది. తాజాగా అమెరికా బహిరంగ మద్దతు రావడంతో తైవాన్‌కు మరింత ఆర్థిక స్తైర్యం వచ్చి ఉంటుందని, డ్రాగన్ కాస్త వెనకడుగు వేయొచ్చని అంటున్నారు.

Updated Date - 2021-10-22T21:42:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising