ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెజాన్..చడీచప్పుడూ లేకుండా చక్కబెట్టేసింది.. నెటిజన్లు గగ్గోలు పెట్టారని..

ABN, First Publish Date - 2021-03-03T23:08:46+05:30

ప్రజాభీష్టం మేరకు తమ లోగోల్లో మార్పులు చేస్తున్న సంస్థల్లో తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా వచ్చి చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రజాభీష్టం మేరకు తమ లోగోల్లో మార్పులు చేస్తున్న సంస్థల్లో తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా వచ్చి చేరింది. అమెజాన్ లోగోలో చిరునవ్వును సూచించే గుర్తుతో పాటూ దానిపై చిన్న నీలి రంగు రిబ్బన్ కూడా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే..ఈ డిజైన్ హిట్లర్ మీసాన్ని గుర్తుకు తెస్తోందని అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అమెజాన్ వెంటనే తన లోగోలు మార్పులు చేసింది. 


ప్రస్తుత లోగోను అమెజాన్ జనవరిలో ఆవిష్కరించింది. అయితే..ఇది నెటిజన్ల దృష్టిలో పడగానే అందులోని లోపాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఆ నీలిరంగు రిబ్బన్ నియంత హిట్లర్ మీసాన్ని గుర్తుకు తెస్తోందని అనేక మంది అభ్యంతరం తెలిపారు. ఇది బాలేదంటూ పెదవి విరుస్తున్న వారి సంఖ్య నానాటీకి పెరుగుతుండటంతో అమెజాన్ ఏ చడీచప్పుడూ లేకుండా దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఎటువంటి అధికారిక ప్రకటనా లేకుండా లోగోలో మార్పులు చేసేసింది. హిట్లర్ మీసాన్ని గుర్తుకు తెస్తున్న రిబ్బన్ స్థానంలో మడతపెట్టినట్టు ఉన్న టేప్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారుల అభిప్రాయాల అనుసరించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘కస్టమర్లను ఆశ్చర్యపరిచేందుకు అమెజాన్ నిరంతరం ప్రయత్నిస్తుంటుంది.  అమెజాన్‌లో షాపింగ్ చేసే వినియోగదారుల్లో ఉత్సాహం, తరువాత ఏ సర్‌ప్రైజ్ రాబోతోందా అనే ఉత్సుకత ప్రేరేపించేలా ఈ లోగోను డిజైన్ చేశాం. అని అమెజాన్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా.. గతంలో మింత్రా కూడా ప్రజల కోరిక మేరకు తన లోగోలో మార్పు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-03-03T23:08:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising