ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Babul Supriyo : రాజకీయాలకు ‘గుడ్‌బై’

ABN, First Publish Date - 2021-07-31T23:04:37+05:30

కేంద్ర మాజీ మంత్రి, బెంగాల్ బీజేపీ ఫైర్‌బ్రాండ్ బబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : కేంద్ర మాజీ మంత్రి, బెంగాల్ బీజేపీ ఫైర్‌బ్రాండ్ బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు శనివారం ప్రకటించారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం అసన్‌సోల్ నుంచి ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు. తన రాజీనామా విషయాన్ని ఆయన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. ‘‘గుడ్ బై... ఏ ఇతర పార్టీల్లోనూ చేరడం లేదు. చేరమని నన్నెవరూ సంప్రదించలేదు. ఎందులోనూ చేరడం లేదు. నేనెప్పుడూ ఒకే పార్టీకి చెందినవాణ్ణి. సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. అయితే సేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. రాజకీయేతర రంగంలో ఉంటు కూడా సేవ చేయవచ్చు.’’ అంటూ బాబుల్ సుప్రియో పోస్ట్ చేశారు. 


కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. సీనియర్లతో పాటు మరికొంత మంది మంత్రులకు కూడా ఉద్వాసన పలికారు. వీరి జాబితాలో బాబుల్ సుప్రియో కూడా ఉన్నారు. ఆయన గతంలో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించినప్పటి నుంచీ సుప్రియో బీజేపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో టోలీగంజ్ నుంచి బరిలోకి దిగారు. అయితే టీఎంసీ అభ్యర్థి అరూప్ విశ్వాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. 

Updated Date - 2021-07-31T23:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising