ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇప్పటికే బుక్ చేసుకున్న కొవిషీల్డ్ రెండో డోస్ అపాయింట్‌మెంట్లు రద్దుకాబోవు’

ABN, First Publish Date - 2021-05-17T02:16:31+05:30

కొవిషీల్డ్ రెండో డోసు వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కొవిషీల్డ్ రెండో డోసు వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న అపాయింట్‌మెంట్లు రద్దు కాబోవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. కొవిన్ ప్లాట్‌ఫామ్‌పై ఈ అపాయింట్‌మెంట్లు రద్దు కాబోవని తెలిపింది. అయితే కొవిన్ డిజిటల్ పోర్టల్‌లో కొన్ని మార్పులు చేశామని, దీని ప్రకారం తొలి డోస్ వేసుకున్న తర్వాత లబ్ధిదారుకు 84 రోజుల కన్నా తక్కువ వ్యవధిలో రెండో డోసు కోసం ఆన్‌లైన్ లేదా ఆన్-సైట్ అపాయింట్‌మెంట్ మంజూరు కాదని వివరించింది.  ఈ నిబంధన కొత్తగా అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించేవారికి మాత్రమే వర్తిస్తుందని వివరించింది. 


కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని ఎన్‌కే అరోరా నేతృత్వంలోని కోవిడ్ వర్కింగ్ గ్రూపు సిఫారసు చేసింది. ఈ సిఫారసును కేంద్ర ప్రభుత్వం మే 13న అమలు చేసింది. ఈ మార్పులను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 


Updated Date - 2021-05-17T02:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising