ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లైన కూతురు కూడా అర్హురాలే: హైకోర్టు

ABN, First Publish Date - 2021-01-14T23:00:17+05:30

భావించరాదంటూ ప్రయాగ్‌రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన ఆర్డర్‌ను సవాల్ చేస్తూ మంజుల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేజే మునిర్ ధర్మాసనం.. పై విధంగా వ్యాఖ్యానించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో కొడుకును ఏ విధంగానైతే భాగస్వామిగా చూస్తారో పెళ్లైన కూతురిని కూడా అదే విధంగా చూడాలని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పెళ్లైన కూతురిని కుటుంబంలో సభ్యురాలిగా భావించరాదంటూ ప్రయాగ్‌రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన ఆర్డర్‌ను సవాల్ చేస్తూ మంజుల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేజే మునిర్ ధర్మాసనం.. పై విధంగా వ్యాఖ్యానించింది.


‘‘ఇంట్లో కొడుకుకు పెళ్లైనప్పటికీ కుటుంబ సభ్యుడిగానే చూస్తారు. అతడు అన్నింటికీ అర్హుడే. మరి కూతురు విషయంలో ఎందుకు వేరుగా చూడాలనుకుంటున్నారు? పెళ్లైన కూతురు ఏదేని అభ్యర్థిత్వానికి అనర్హురాలుగా గుర్తించడం వివక్ష కిందకే వస్తుంది’’ అని కోర్టు అభిప్రాయపడింది. విమ్ల శ్రీవాస్తవ కేసులో కూడా కోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. కారుణ్య నియామకాల్లో కొడుకుకు ఉన్న అర్హతలే పెళ్లైన కూతురికి కూడా ఉంటాయని పేర్కొంది. పెళ్లైన కూతురు కారుణ్య నియామకాలకు అనర్హురాలనడం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2021-01-14T23:00:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising