ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దెబ్బకు దెబ్బ.. యూకే పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేసిన భారత్

ABN, First Publish Date - 2021-10-02T02:31:06+05:30

అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలను ఇటీవల సవరించిన యూకే భారత్ నుంచి వచ్చే వారికి క్వారంటైన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలను ఇటీవల సవరించిన యూకే భారత్ నుంచి వచ్చే వారికి క్వారంటైన్ తప్పనిసరి చేసింది. యూకేలో అడుగుపెట్టాలంటే కొవిడ్-19 పరీక్షకు సంబంధించి నెగటివ్ రిపోర్టును తప్పనిసరి చేయడంతో పాటు పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు, వ్యాక్సినేషన్ పూర్తయిన వారిని కూడా టీకా వేయించుకోని వారిగానే పరిగణిస్తామని పేర్కొంది.


 ఈ నేపథ్యంలో తాజాగా భారత్ కూడా దీటుగా స్పందించింది. అలాంటి నిబంధనే యూకే పౌరులకు కూడా విధించింది. ఈ నెల 4 నుంచి భారత్ రావాలనుకునే యూకే పౌరులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది. అలాగే, భారత్‌లో అడుగుపెట్టడంతో 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాలంటూ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. యూకేలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతుండడం కూడా భారత్ నిర్ణయానికి ఓ కారణం. 


ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం..

* అక్టోబరు 4 నుంచి తాజా నిబంధనలు వర్తిస్తాయి

* ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి

* భారత్ చేరుకున్న తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి

* దేశంలో అడుగుపెట్టిన 8 రోజుల తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి

* ఇండియాకు చేరుకున్న తర్వాత ఇంటిలో కానీ, గమ్యస్థాన ప్రదేశంలో కానీ 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి  

Updated Date - 2021-10-02T02:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising