ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajasthanలో 9మంది ఒమైక్రాన్ రోగులకు కొవిడ్ నెగిటివ్...ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

ABN, First Publish Date - 2021-12-10T13:57:03+05:30

కరోనావైరస్ ఒమైక్రాన్ వేరియంట్ బారిన పడి జైపూర్‌లోని ఆసుపత్రిలో చేరిన మొత్తం తొమ్మిది మంది రోగులు కోలుకున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనావైరస్ ఒమైక్రాన్ వేరియంట్ బారిన పడి జైపూర్‌లోని ఆసుపత్రిలో చేరిన మొత్తం తొమ్మిది మంది రోగులు కోలుకున్నారు. ఒమైక్రాన్ బారిన పడిన రోగులకు తాజాగా జరిపిన పరీక్షలో కొవిడ్ నెగిటివ్ అని వచ్చింది. కరోనా పరీక్ష ఫలితాలు ప్రతికూలంగా రావడంతో తొమ్మిది మంది రోగులను  హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.9 మంది రోగులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వారి సీటీస్కాన్, రక్తపరీక్షల నివేదికలు సాధారణమైనవని వచ్చిందని వైద్యులు చెప్పారు. ఒమైక్రాన్ వేరియెంట్ నుంచి కోలుకున్న 9మంది రోగులు 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.కరోనావైరస్ ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజస్థాన్ ఆరోగ్య మంత్రి పార్సాది లాల్ మీనా సూచించారు.


ఒమైక్రాన్ రోగులతో కాంటాక్ట్ ఉన్న వారిని కూడా గుర్తించి వారికి కరోనా పరీక్షలు చేశామని మంత్రి చెప్పారు.సవాయ్ మాన్ సింగ్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధీర్ భండారీ మాట్లాడుతూ, ఒమైక్రాన్ వేరియంట్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, అయితే ఇది డెల్టా వేరియంట్‌లా ప్రాణాంతకం కాదన్నారు.రెండు మోతాదుల కొవిడ్ వ్యాక్సిన్‌లు తీసుకున్నప్పుడు వైరస్ తక్కువ ప్రభావాన్ని చూపుతుందని డాక్టర్ సుధీర్ చెప్పారు.

Updated Date - 2021-12-10T13:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising