ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులాలవారీ జనగణన జరగాలి: అఖిలేష్

ABN, First Publish Date - 2021-08-10T23:18:09+05:30

దళితులు, వెనుకబడిన తరగతుల వారికి బీజేపీ తప్పుడు హామీలు ఇస్తోందని సమాజ్‌వాదీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దళితులు, వెనుకబడిన తరగతుల వారికి బీజేపీ తప్పుడు హామీలు ఇస్తోందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. కులలవారీ జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన రాజ్యాంగ (127వ సవరణ) బిల్లుకు అఖిలేష్ మద్దతు పలికారు. సామాజిక, వెనుకబడిన వర్గాలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం మంచిదేనని, ప్రతి ఒక్కరు కులాల వారీ జనగణను కోరుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగ సవరణను బిల్లును కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై అఖిలేష్ మాట్లాడుతూ, దళితులు, వెనుకబడిన తరగతుల వారికి బీజేపీ తప్పుడు హామీలిస్తోందన్నారు. అన్ని కులాల్లో ఉన్న వెనుకబడిన, పేద వర్గాలకు కూడా రిజర్వేషన్ వర్తించేలా 50 శాతం రిజర్వేషన్ పరిమితిని పెంచాలని అన్నారు. వెనుకబడిన తరగుతల వారికి మంత్రి పదవులు పెంచినంత మాత్రాన వారు అభివృద్ధి చెందరని, రిజర్వేషన్ క్యాప్ 50 శాతానికి మించి పెంచిచేనే ఉపయోగం ఉంటుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.

Updated Date - 2021-08-10T23:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising