ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్జేడీకి తేజ్ ప్రతాప్ సన్నిహితుడు గుడ్‌బై!

ABN, First Publish Date - 2021-08-27T20:03:07+05:30

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ సన్నిహితుడు ఆకాశ్ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే ఎల్‌జేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనను  ఆర్జేడీ యువజన విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి ఇటీవలే తొలగించారు. 


విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆకాశ్ యాదవ్‌ను ఆర్జేడీ రాష్ట్ర యువజన విభాగం చీఫ్ పదవి నుంచి తప్పించడంపై ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ మధ్య రెండు రోజుల క్రితం వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆకాశ్‌ను ఆ పదవి నుంచి తొలగించడంతో అన్నదమ్ములిద్దరి మధ్య యుద్ధం తారస్థాయికి చేరినట్లు సమాచారం. 


తేజస్వికి సలహాదారుగా వచ్చిన ఓ వలసదారు సిఫారసు మేరకు ఆకాశ్ యాదవ్‌ను పదవి నుంచి తొలగించారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. దీనిపై తేజస్వి స్పందిస్తూ, హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లా నుంచి వచ్చిన సంజయ్ యాదవ్‌ తనకు సలహాదారు అని, తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపణలు సంజయ్‌ని ఉద్దేశించి చేసినవేనని మండిపడ్డారు. 


ఆకాశ్ యాదవ్‌ను పదవి నుంచి తొలగించిన ఆర్జేడీ బిహార్ శాఖ అధ్యక్షుడు జగదానంద సింగ్‌పై పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ చర్య తీసుకోవాలని తేజ్ ప్రతాప్ యాదవ్ డిమాండ్ చేశారు. లాలూ స్పందించకపోతే తాను కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. 


Updated Date - 2021-08-27T20:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising