ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ విమానానికి కాబూల్‌లో ల్యాండింగ్ కష్టాలు

ABN, First Publish Date - 2021-08-15T23:16:55+05:30

ఢిల్లీ నుంచి కాబూల్ వెళ్ళిన ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : ఢిల్లీ నుంచి కాబూల్ వెళ్ళిన ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబూల్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఈ విమానం సుమారు గంట సేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టవలసి వచ్చింది. ఓ దశలో పైలట్ విమానం రాడార్‌ను స్విచాఫ్ చేశారు. ఈ విమానాన్ని శత్రువులు గుర్తించి, టార్గెట్ చేస్తారేమోననే ఉద్దేశంతో రాడార్‌ను స్విచాఫ్ చేశారు. ఉద్విగ్న వాతావరణంలో ఓ గంట ఆలస్యంగా ఎట్టకేలకు ఈ విమానం ల్యాండ్ అయింది. 


ఎయిరిండియా ఫ్లైట్ 243 ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. కాబూల్ నగరానికి ప్రయాణ కాలం 2 గంటల 20 నిమిషాలు. కాబూల్ శివారులో తాలిబన్ ఉగ్రవాదులు ఉన్నారు. అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఈ విమానం ఆకాశంలోనే ఎగురవలసి వచ్చింది. నాటకీయ పరిణామాల తర్వాత ఓ గంట ఆలస్యంగా దిగింది. కాబూల్‌లోని భారతీయ దౌత్యవేత్తలు, భద్రతా సిబ్బంది భారత దేశానికి ఈ విమానంలో తిరిగి రావలసి ఉంది. 


కాందహార్, మజారే షరీఫ్ నగరాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలను స్థానిక సిబ్బందికి అప్పగించారు. ఈ కార్యాలయాల్లోని భారతీయ సిబ్బందిని ప్రత్యేక విమానాల ద్వారా తరలించారు. 


ప్రస్తుతం ఎయిరిండియా 243 విమానం కాబూల్ విమానాశ్రయంలో ఉంది. ఇంధనాన్ని నింపుకుని, ఢిల్లీకి బయల్దేరవలసి ఉంది.


Updated Date - 2021-08-15T23:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising