ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

wins bid:టాటా సన్స్ చేతుల్లోకి ఎయిర్ ఇండియా

ABN, First Publish Date - 2021-10-01T17:49:59+05:30

దేశీయ విమాన దిగ్గజమైన ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కొనుగోలు చేయనుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :దేశీయ విమాన దిగ్గజమైన ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కొనుగోలు చేయనుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ తుది బిడ్ ను గెలుచుకుందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కూడా బిడ్ వేసినప్పటికి, టాటాసన్స్  ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం అధిక ఆఫరును సమర్పించారని అధికారులు చెప్పారు. టాటాసన్స్ సమర్పించిన బిడ్ ప్రభుత్వ కమిటీ నిర్ణయించిన కనీస ధర కంటే 3000 కోట్ల రూపాయలు ఎక్కువ అని సమాచారం.


ఎయిర్ ఇండియా పట్ల టాటాకు మక్కువ ఉన్నందున,దీని విస్తరణకు పెద్దమొత్తంలో డబ్బును టాటా సన్స్ పెట్టే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా మాజీ డైరెక్టర్ జితేంద్ర భార్గవ చెప్పారు. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం టాటా సన్స్ బిడ్ కు ఓకే చెప్పినా దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ తుది ప్రకటన చేయాల్సి ఉంది. భారీనష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా టాటాల చేతుల్లోనైనా లాభాల బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2021-10-01T17:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising