ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమాన సిబ్బందిపై దాడి.. ఫ్రెంచ్ విమానంలో భారతీయుడి ఆగడం!

ABN, First Publish Date - 2021-03-07T02:45:26+05:30

ప్యారిస్‌ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ఓ భారతీయుడుకు నానా బీభత్సం సృష్టించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొఫియా: ప్యారిస్‌ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ఓ భారతీయుడు నానా బీభత్సం సృష్టించాడు. తోటి ప్రయాణికులతో గొడవ పడి, విమానం సిబ్బందిలో ఒకరిపై దాడి చేసి అల్లకల్లోం రేపాడు. సిబ్బంది అతడిని నిలువరించలేక పోవడంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా బల్గేరియాలోని సొఫియా విమానాశ్రయంలో దింపేయాల్సి వచ్చింది. బల్గేరియా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఫ్లైట్ సోఫియా ఎయిర్ పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ అయింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే అతడు రచ్చ చేయడం ప్రారంభించాడని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. విమానం భద్రతను ప్రమాదంలో పడేసింనందుకు అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అతడికి అత్యధికంగా 10 ఏళ్ల పాటు కటకటలాపాలవ్వాల్సి ఉంటుంది. అతడి వివరాలు మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఆ ప్రయాణికుడు ఎందుకిలా చేశాడనే దానిపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఘటన అనంతరం.. విమానం యథాప్రకారం న్యూఢిల్లీకి ప్రయాణమైంది.

Updated Date - 2021-03-07T02:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising