ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రాహుల్

ABN, First Publish Date - 2021-06-22T17:31:29+05:30

దేశంలో కరోనా థర్డ్ వేవ్‌కు అవకాశం ఉందని పలువురు నిపుణులు అంగీకరిస్తున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:  దేశంలో కరోనా థర్డ్ వేవ్‌కు అవకాశం ఉందని పలువురు నిపుణులు అంగీకరిస్తున్న నేపథ్యంలో కోవిడ్‌‌పై శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విడుదల చేశారు. మంగళవారంనాడు మీడియాతో వర్చువల్ మీటింగ్‌లో ఈ శ్వేతపత్రాన్ని ఆయన రిలీజ్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు తాము ఈ శ్వేతపత్రం విడుదల చేయడం లేదని, థర్డ్‌వేవ్ ఇన్ఫెక్షన్‌ను దేశం సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఈ శ్వేతపత్రం సహకరిస్తుందని రాహుల్ ఈ సందర్భంగా ఉన్నారు. ఇదొక ''బ్లూప్రింట్" అని చెప్పారు. థర్డ్ వేవ్ రాబోతున్న విషయం యావత్ దేశానికి తెలుసునని ఆయన పేర్కొన్నారు. తొలి, రెండవ విడత కోవిడ్ మేనేజిమెంట్‌‌ కారణంగా భారీ విపత్తు ఏర్పడిందనే విషయం చాలా స్పష్టమని, దీనికి కారణం ఏమిటో, ఎక్కడ పొరపాటు జరిగిందో (సెకెండ్ వేవ్ నిర్వహణలో) చెప్పే ప్రయత్నం చేశామని అన్నారు. వైరస్ మ్యుటేట్ అవుతున్నందున థర్డ్ వేవ్ తర్వాత కూడా మరిన్ని వేవ్స్ ఉండొచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. సోమవారంనాడు రికార్డు స్థాయిలో వ్యాక్సిన్‌లు ఇవ్వడం సంతోషకరమేనని, అయితే ఇది తూతూ మంత్రం కాకూడదని అన్నారు. ఏదో ఒక్క రోజుకు పరిమితం కాకుండా యావత్ జనాభాకు వ్యాక్సినేషన్ ఇచ్చేంతవరకూ ఈ తరహా పనితీరు చూపించాలని రాహుల్ సూచించారు.


మూడో వేవ్ వస్తోంది...

కరోనా థర్డ్ వేవ్ రాబోతోందనే విషయం చాలా స్పష్టమని రాహుల్ అన్నారు. వైరస్ మ్యూటేట్ అవుతోందని, దానిని   ఎలా ఎదుర్కోవాలనే దానిని నిపుణులతో కలిసి చర్చించి, శ్వేతపత్రంలో సూచనలు చేశామని చెప్పారు. వ్యాక్సినేషన్ అనేది అన్నింటికంటే చాలా ముఖ్యమని, చాలా వేగంగా వ్యాక్సినేషన్ జరిపి 100 శాతం పూర్తి చేయాలని, ఆసుపత్రులు, ఆక్సిజన్, పడకలు, ఇలా అవసరమైన వాటన్నంటినీ ముందుగానే ప్రభుత్వం సిద్ధం చేసి థర్డ్ వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అందుకు తాము విడుదల చేసిన శ్వేతపత్రం ఉపకరిస్తుందని రాహుల్ చెప్పారు.

Updated Date - 2021-06-22T17:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising