ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

700 మంది రైతుల మరణాలకు కేంద్రానిదే బాధ్యత: Viju krishnan

ABN, First Publish Date - 2021-11-19T15:59:57+05:30

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ఎఐకెఎస్ జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ఎఐకెఎస్ జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్ స్పందించారు. మూడు చట్టాలను రద్దు కోరుతూ జరిగిన ఉద్యమంలో అమరవీరులైన సుమారు ఏడు వందల మంది రైతుల మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర చట్టంపై స్పష్టం చేయాలని... దాని గురించి మోడీ మట్లాడలేదని అన్నారు. తమ డిమాండ్లలో ఎంఎస్పి చట్టం, విద్యుత్ బిల్లు ఉపసంహరణ, అలాగే రాజధాని పరివాహక ప్రాంతంలో గడ్డి కాల్చిన రైతులపై జరిమానా విధించడాన్ని ఉపసంహరణ చట్టం వెనక్కి తీసుకోవాలని తెలిపారు. కానీ... మోడీ ప్రసంగంలో ఆ డిమాండ్ల గురించి ప్రస్తావన లేదన్నారు. అయితే రైతుల ఐక్య పోరాట ఒత్తిడి మేరకే మూడు రైతు చట్టాలను రద్దు చేస్తామని మోడీ సర్కార్ అన్నారని విజూ కృష్ణన్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-19T15:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising