ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్

ABN, First Publish Date - 2021-03-04T03:17:19+05:30

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్ ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్ ఏర్పడింది. రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు శశికళ ప్రకటించారు. తనకు అధికార దాహం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి ఆమె జైలు నుంచి రావడంతోటే రాజకీయాలు వేడెక్కాయి. అప్పటిదాకా అన్నాడీఎంకే-బీజేపీ కూటమి వర్సెస్ డీఎంకే- కాంగ్రెస్ కూటమి అనుకున్న పోటీ కాస్తా ఆమె రాకతో త్రిముఖ పోటీ తప్పదన్నట్లుగా కథనాలొచ్చాయి. దీనికి తోడు ఆమె తిరిగి అన్నాడీఎంకేలోకి రావాలని కొందరు, వద్దని మరికొందరు నాయకులు వాదులాడుకోవడం ప్రారంభించారు. దీంతో అన్నాడీఎంకే- బీజేపీ కూటమి విజయావకాశాలకు చెక్ పడుతుందని అంతా అంచనా వేశారు. డీఎంకేను ఢీ కొట్టాలంటే అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో ఐక్యత తప్పనిసరని కమలనాథులతో పాటు అన్నాడీఎంకేలో సీనియర్ నేతలు నిర్ణయించారు. దీంతో ఏం జరిగిందో ఏమో శశికళ ఒక్కసారిగా తన నిర్ణయం మార్చుకున్నారు. రాజకీయాలనుంచే పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అన్నాడీఎంకే క్యాడర్ అంతా ఐక్యంగా ఉంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-03-04T03:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising