ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఫొటో గుర్తుందా..? భర్త ప్రాణం కోసం చివరి ప్రయత్నం చేసిన ఆ భార్య పరిస్థితి ఇప్పుడేంటో తెలుసా..?

ABN, First Publish Date - 2021-06-16T22:55:23+05:30

భర్తను రక్షించుకునేందుకు ఆయన నోటిలో నోరు పెట్టి ఊపిరి ఊదిన ఆగ్రా మహిళ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పై ఫొటో గుర్తుందా..? కోవిడ్ కారణంగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన భర్తను రక్షించుకునేందుకు ఆయన నోటిలో నోరు పెట్టి ఊపిరి ఊదిన ఆగ్రా మహిళకు చెందిన ఈ ఫొటో నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న భర్తను కాపాడుకునేందుకు ఆమె తన నోటితోనే శ్వాస అందించేందుకు ప్రయత్నించింది. కానీ, సాధ్యం కాలేదు. ఆస్పత్రికి చేరేలోపే.. అతడు ఆమె ఒడిలోనే ప్రాణాలు వదిలాడు. తనకు ప్రమాదమని తెలిసినా భర్త ప్రాణాలను కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నం అందరినీ కదిలించింది. 


ఆమె పేరు రేణు సింఘాల్. ప్రస్తుతం ఆమె తన 16 ఏళ్ల కూతురు భూమితో కలిసి ఆగ్రాలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటోంది. సంపాదనాపరుడైన భర్తను కోల్పోవడంతో ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన కూతురి భవిష్యత్తు గురించి బెంగపడుతోంది. తను ఏదైనా ఉద్యోగం చేద్దామంటే లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి అవకాశాలూ రావడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ తమను ఆదుకోవాలని కోరుతోంది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నామని, తమను ఆదుకోవాలని ఆమె యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. 




Updated Date - 2021-06-16T22:55:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising