ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Black fungusకి ఇల్లాలు బలి.... ఆ కుటుంబం తీవ్ర నిర్ణయం

ABN, First Publish Date - 2021-10-24T00:14:38+05:30

బ్లాక్ ఫంగస్ కారణంగా భార్య చనిపోవడాన్ని తట్టుకోలేని భర్త తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. నలుగురు పిల్లలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెళగావి (కర్ణాటక): బ్లాక్ ఫంగస్ కారణంగా భార్య చనిపోవడాన్ని తట్టుకోలేని భర్త తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. హుక్కేరి తాలుకాలోని ఓ గ్రామంలో జరిగిందీ విషాదం. పోలీసుల కథనం ప్రకారం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అయిన గోపాల్ హదిమణి (46) తన కుమార్తెలు సౌమ్య (19), శ్వేత (16), సాక్షి (11), శ్రీజన్ హదిమణి (8) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం పొద్దెక్కినా ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానించిన ఇరుగుపొరుగువారు బంధువులకు, పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


హదిమణి భార్య జులైలో కరోనా బారిన పడిందని, ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ సోకి మరణించిందని హదిమణి బంధువు తెలిపారు. ఆమె మరణంతో హదిమణి కుంగిపోయాడని పేర్కొన్నారు. ఆమె లేకుండా తాము బతకలేమని హదిమణి, కుటుంబ సభ్యులు పదేపదే చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-24T00:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising