ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘాన్‌ మాజీ మంత్రి పిజ్జా డెలివరీ బాయ్‌

ABN, First Publish Date - 2021-08-26T07:07:57+05:30

అఫ్ఘానిస్థాన్‌ ప్రభుత్వంలో రెండేళ్లు మంత్రిగా పనిచేసిన సయీద్‌ అహ్మద్‌ షా ప్రస్తుతం జర్మ నీ వీధుల్లో సైకిల్‌పై తిరుగుతూ పిజ్జాలు డెలివరీ చేస్తున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 25: అఫ్ఘానిస్థాన్‌ ప్రభుత్వంలో రెండేళ్లు మంత్రిగా పనిచేసిన సయీద్‌ అహ్మద్‌ షా ప్రస్తుతం జర్మ నీ వీధుల్లో సైకిల్‌పై తిరుగుతూ పిజ్జాలు డెలివరీ చేస్తున్నారు. ఈ మేరకు అల్‌-జజీరా అరేబియా వార్త సంస్థ పిజ్జా డెలివరీ బాయ్‌గా సయీద్‌ ఫొటో సహా వివరాల ను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఇది వాస్తవమేనని సయీద్‌ అన్నారు. 2018-2020 మధ్య అఫ్రాఫ్‌ ఘనీ ప్రభుత్వంలో సమాచార, సాంకేతిక శాఖ మంత్రిగా సయీద్‌ పనిచేశారు. అష్రా్‌ఫతో విభేదాలు తలెత్తడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి గత డిసెంబరులోనే జర్మనీ వెళ్లిపోయారు. తన వద్ద ఉన్న డబ్బంతా అయిపోయిందని, దీంతో జర్మనీలోనే లివ్రాండో అనే ఓ కంపెనీలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. సయీద్‌ ప్రతిష్ఠాత్మకమైన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్స్‌, ఎలకా్ట్రనిక్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేశారు. 23 ఏళ్లపాటు 13 దేశాలకు చెంది న 20 కంపెనీల్లో పనిచేశారు. 2005 - 2013 మధ్య అఫ్ఘాన్‌ ప్రభుత్వ సమాచార, సాంకేతిక శాఖకు సాంకేతిక సలహాదారుగానూ సేవలందించారు. లండన్‌లోని అరియానా టెలి కాం కంపెనీకి 2016-17 మధ్య సీఈవోగా పనిచేశారు.

Updated Date - 2021-08-26T07:07:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising