నటుడు హంసవర్ధన్‌కు సతీవియోగం
ABN, First Publish Date - 2021-06-23T13:07:09+05:30
ప్రముఖ నటుడు హంసవర్ధన్ సతీమణి శాంతి వర్ధన్ (42) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం మరణించారు. ఆమె అంత్యక్రియలు మం
అడయార్(చెన్నై): ప్రముఖ నటుడు హంసవర్ధన్ సతీమణి శాంతి వర్ధన్ (42) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం మరణించారు. ఆమె అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. దివగంత ప్రముఖ నటుడు రవిచంద్రన్ కోడలు గానే కాకుండా, సినీ నటిగా కూడా ఆమెకు మంచి గుర్తింపువుంది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్న ఈమె ఇటీవల కరోనా బారినపడ్డారు. అయితే, ఆమెకు మెరుగైన వైద్యం అందించడంతో కోలుకున్నా కానీ, ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో ఆమెను తిరిగి ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Updated Date - 2021-06-23T13:07:09+05:30 IST